A doll named after Bollywood icon Sridevi adorns a restaurant in Singapore. Her proud husband Boney Kapoor said: "There are restaurants and shops named after her in India and abroad. It just shows her enduring stardom."
అతిలోక సుందరిగా ఒకప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ రారాణిగా వెలుగొందిన శ్రీదేవికి అప్పట్లో ఏ హీరోయిన్ కు లేనంత ఫాలోయింగ్ ఉండేది. ప్రస్తుతం ఆమె ఫాంలో లేక పోయినా ఆమె అందాన్ని ఆరాధించే అభిమానులు దేశ విదేశాల్లో ఉన్నారు. శ్రీదేవి అభిమాని ఒకరు సింగపూర్‌లోని తన రెస్టారెంట్‌లో ఆమె బొమ్మను ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ ఆ రెస్టారెంటకు వచ్చే వారిని అందమైన శ్రీదేవి బొమ్మ ఎంతగానో ఆకట్టుకంటోంది. ఈ బొమ్మ విషయం శ్రీదేవి భర్త బోనీకపూర్ దృష్టికి రావడంతో సోషల్ మీడియా ద్వారా సంతోషం వ్యక్తం చేశారు.
"మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా శ్రీదేవికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆమెకు ఎంత స్టార్ డమ్ ఉందో చెప్పడానికి ఇదో చిన్న ఉదాహరణ. చాలా సంతోషంగా ఉంది'' అంటూ బోనీ కపూర్ తన భార్య గురించి గర్వంగా చెప్పారు.
రెస్టారెంటులో తన బొమ్మ ఏర్పాటు చేయడంపై శ్రీదేవి ఆనందం వ్యక్తం చేశారు. తనకు మాటలు రావడం లేదని, తన పేరును ఎంతో స్వీట్ గా వాడుకుంటున్నారని చెప్పారు. గత యాభై ఏళ్లుగా అభిమానులు తనపై చూపుతున్న అభిమానం వెలకట్టలేనిదన్నారు.